- కర్ణాటక ఫలితాలు బిజెపికి చెంప పెట్టు*
- తెలంగాణలో సీఎం కెసిఆర్ ఉండగా కాంగ్రెస్, బిజెపిలకు ,చోటు లేదు..
జిల్లా BRS పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అభివృద్ధి మరిచి మతాలు దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపి పట్ల యావత్ దేశ ప్రజలు విసుగు చెందారని అందుకే కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిదర్శనమని బీ ఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ అన్వర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
డబల్ ఇంజన్ సర్కారును తిరస్కరించి కర్ణాటక ప్రజలు బిజెపికి చెంప దెబ్బ లాంటి తీర్పునిచ్చారని ఆయన తెలిపారు.బిజెపికి 40 శాతం కమిషన్ అవినీతి పాలన వైపు అయితే మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ దేశ సంపదంత మోడీ దోస్త్ ఆదానికి ధారధాతం చేస్తూ అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కొలుస్తూ నీచ రాజకీయాలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు.
ప్రజల పట్ల వైషమ్యాలు రెచ్చగొట్టి దేశభద్రతనే గాలికి వదిలేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి అసమర్థత అవినీతి పాలన వలన సిలిండర్ పెట్రోల్ ,డీజిల్ నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటి సామాన్య ప్రజలు అరిగోస పడుతున్నారని తెలిపారు*
కర్ణాటక ప్రజలు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు.దమ్ముంటే మొదలు కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపాలని సవాల్ చేశారు.