మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని రెగళ్ళ- పడిగపూరం గ్రామల మద్యలో వాగుపై 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చెపడుతున్న హైలెవల్ బ్రిడ్జి పనులను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత కూడిన పనులు చెయ్యాలని,నాణ్యత పాటించకుంటె ఎంతటి వారినైన ఉపెక్షించెది లేదన్నారు. పనులను త్వరగా పూర్తి చెసి జూన్ మొదటి వారంకల్ల ప్రజలకు అందుబాటులోకి తిసుకరవాలని గుత్తేదారు నికి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజ.వసంతరావు,ఎంపీపీ రేగా కాళికా, సర్పంచ్ లు పాయం.నర్సింహరావు,ఊకె. రామనాథం,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, నాయకులు బుడగం.రాము,కొంపెల్లి పెద రామలింగం,రేగా సత్యనారాయణ,పూజారి.క్రిష్ణ,గుమ్మడివెల్లి.ప్రసాద్,కటుకోజ్వల.వేణు, తదితరులు పాల్గొన్నారు.