- హనుమాన్ డిజిటల్ స్టూడియో ని ప్రారంభించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు.
దళిత బందు పథకం పేద దళిత లబ్ధి దారులకు ఓ వరం లాంటిది ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని తాటిగూడెం గ్రామ పంచాయతీలోని గాంధీనాగర్ కాలనీకి చెందిన గాందర్ల.సత్తిష్ కి దళిత బంధు పథకం ద్వారా మంజూరు అయిన డిజిటల్ స్టూడియో ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళితుల సమగ్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలులోకి తిసుకొచ్చరాని అన్నారు.75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళిత బంధు పథకం లాంటి తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావటం లేదని అన్నారు.దళిత సమాజాన్ని ఆర్థికంగా పురోగతి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా,స్థానిక సర్పంచ్ ఊకె.రామనాథం,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, నాయకులు రేగా.సత్యనారాయణ,కొంపెల్లి పెద రామలింగం,బుడగం. రాము తదితరులు పాల్గొన్నారు.