UPDATES  

 ఎండ దెబ్బకు సింగరేణి కార్మికుల విలవిల పని వేళల్లో మార్పులు చేసి, రక్షణ చర్యలు చేపట్టాలి- సిఐటియూ

  • ఎండ దెబ్బకు సింగరేణి కార్మికుల విలవిల
  • పని వేళల్లో మార్పులు చేసి, రక్షణ చర్యలు చేపట్టాలి- సిఐటియూ

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 16

మణుగూరు సింగరేణి గనులలో రోజు రోజుకు ఎండలు మండుతున్నాయని,45 డిగ్రీ లకు పైన రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు అవుతుంది.ఎండ దెబ్బకు కార్మికులు,విలవిలలాడుతున్నారని,సింగరేణి యాజమాన్యం పని గంటలు కుదించి పని వేళలు మార్చాలి అని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి వల్లూరి వెంకటరత్నం యాజమాన్యాని డిమాండ్ చేశారు.మంగళవారం పీవీ కాలనీ యూనియన్ కార్యాలయంలో టీవీ ఎంవీ. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఎండలు మండుతున్న కారణంగా సింగరేణిలో పనిగంటలు కుదించాలని అన్నారు.గత రెండు రోజులుగా మణుగూరు ఏరియాలో విపరీతంగా ఎండలు మండుతున్నాయని,ఉష్ణోగ్రతలు అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు,అవుతున్నాయన్నారు.ఎండల కారణంగా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,మిషనరీ కూడా రిపేర్లకు గురి అవుతున్నాయని అన్నారు. కావున పని గంటలు కుదించి కార్మికులను,మిషనరీని కాపాడి సింగరేణి భవిష్యత్తును కాపాడాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పని గంటలు కుదించి వారిని కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.పని ప్రదేశాలలో సలువ పందిల్లు వేయించి,కూలర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మజ్జిగ ప్యాకెట్లు అందించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఈశ్వరరావు, రామ్మూర్తి,లక్ష్మణరావు,ప్రభాకర్ రావు,విల్సన్,రాజు,ముజఫర్,బిక్షపతి,బుచ్చిరెడ్డి,పారుపల్లి,లక్ష్మణరావు,రాజు సుమన్,శివ కుమార్,రామకృష్ణ,వినోద్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !