మన్యం న్యూస్ గుండాల: ఆదివాసి అస్తిత్వంపై జరిగే సదస్సును జయప్రదం చేయాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం కోరారు. మండలం పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆదివాసి యువత సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసులకు పెద్ద ఎత్తున అన్యాయం చేస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ తీసుకువచ్చే చట్టాలతో కొన్ని లక్షల మంది పోడు భూములను వదులుకునే పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈనెల 21న విశాఖపట్నంలో జరిగే ఆదివాసి సదస్సుకు దేశం నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీతారాములు, నాయకులు ఈసం కృష్ణ , పెంటన్న, వు బాబు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు