జీతాలు పెంచుకుంటే సమ్మె తీవ్రతరం చేస్తాం.
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల పోరాటం నిరాహార దీక్ష తో ఉదృతం.
– నిరాహార దీక్ష ప్రారభించిన ఎం ఎన్ రెడ్డి.
– కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి .
— సీఐటీయూ డిమాండ్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
:ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న అద్దె బస్సులు డ్రైవర్లు హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు వ్యవస్థాపక నేత ఎమ్ ఎన్ రెడ్డి ప్రభుత్వాన్ని , బస్సు యజమానులను డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని స్థానిక కొత్తగూడెం డిపో హైర్ బస్ డ్రైవర్స్& హెల్పర్స్ యూనియన్ అధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది.. ఈ సందర్బంగా ఎమ్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగస్తులకు సమానంగా పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని కనీస వేతన అమలు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఒకటే అయినప్పుడు వేతనాలు ఎందుకు తేడా చేస్తున్నారొ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. యూనియన్లు పెట్టొద్దని, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయొద్దని, ఒకవైపు బిజెపి ప్రభుత్వం మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులపై నిర్బంధాలను ప్రయోగించి ఉద్యమాలను విచ్చిన్నం చేస్తున్నారన్నరు. కార్మిక హక్కులు కాల రాస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు . అద్దె బస్సు కార్మికులకు వేతనాలు పెంచే వరకు దశలవారు ఉద్యమాలు నిర్మిస్తామని తెలిపారు . దశల వారీగా ఉద్యమాలు శాంతి యుతంగా ఐక్యంగా చేస్తున్నా కూడా బస్సు యజమానులు ఏమి పట్టనట్లు గా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల పక్షాన సీఐటీయూ నికరంగా పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి డి వీరన్న, భూక్యా రమేష్, జాకబ్ , ఎవి రెడ్డి, హెర్ బస్ అధ్యక్ష కార్యదర్శులు సైదులు, నరసింహా , కోశాధి కారి గిరిబాబు, శ్రీకాంత్, కళ్యాణ్, పాషా, తదితరులు పాల్గొన్నారు.