- పేదోడి భూమిలో పంచాయతీ భవన నిర్మాణం …..
లబోదిబోమంటున్న గిరిజన రైతు - తనకు న్యాయం చేయాలంటూ వేడుకొంటున్నాడు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- ఆక్రమిత భూమిలో అర్ధరాత్రి భవన నిర్మాణ పనులు
మన్యం న్యూస్ చర్ల :
చర్ల మండలంలోని సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన ముర్రం రామ్మూర్తి అనే గిరిజన రైతుకు కలివేరు గ్రామంలో 1.70 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కలివేరు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పేద గిరిజన రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో అధికారులు పంచాయతీ కార్యాలయం పనులు చేపట్టారు.
తన అనుమతి లేకుండా తన భూమిలో పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులు చేస్తున్నారని తెలుసుకున్న రైతు పనులను అడ్డుకోవడంతో అర్ధరాత్రి సమయాల్లో పనులు చేస్తున్నారని రైతు లబోదిబోమంటున్నాడు.
తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, తమ జీవనాధారమైన భూమి ని అధికారులు ఆక్రమించటంతో బాధిత రైతు తనకు న్యాయం చేయాలంటూ చర్ల తహసీల్దార్, భద్రాచలం ఐటీడీఏ పీవో, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. అదే గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి తన నుంచి రూ 5 వేల రూపాయల నగదు తీసుకుని తనకు అన్యాయం చేశారని ఆరోపించారు.కావున దయచేసి నాకు న్యాయం చెయ్యగలరు అని ఉన్నతాధికారులను వేడుకుంటున్నను.