“లా” లో గోల్డ్ మెడల్ సాధించిన తాతభార్గవ్ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యలమద్ది రవి మన్యంన్యూస్,ఇల్లందు:ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూధన్ తనయుడు తాతా భార్గవ్ ప్రతిష్టాత్మక న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి “లా” లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా సీనియర్ నాయకులు యలమద్ది రవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తండ్రి తాతా మధుసూధన్ ఏమో ఉస్మానియా యూనివర్సిటీ నుండి “లా” లో గోల్డ్ మెడల్ సాధిస్తే, తనయుడేమో ప్రతిష్టాత్మక న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి “లా”లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి గోల్డ్ మెడల్ సాధించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని తెలిపారు. శాసనమండలి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు-భవాని దంపతుల తనయుడు ప్రతిష్టాత్మక న్యూయార్క్ యూనివర్సిటీ నుండి లా లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తాతా భార్గవ్ మున్ముందు మరెన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భార్గవ్ కు జిల్లా నాయకులు ఎలమద్ది రవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.