మన్యం న్యూస్ వాజేడు
మండలంలో టేకులగూడ గ్రామం సమీపాన గోదావరి నదికి స్నానం చెయ్యడానికి వెళ్లిన కోర్స నవీన్( 16) సంవత్సరాలు, కోయ వీరాపురం తన స్నేహితులతో కలిసి టేకులగూడెం గ్రామంలో వివాహానికి వెళ్లి గ్రామం శివారులో గల గోదావరి నదిలో స్థానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని జాలర్ల సహాయంతో వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏటునాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడు తండ్రి కోర్స నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హరీష్ తెలిపారు.