మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 19
మణుగూరు మండలం లోని ప్రధాన రోడ్డు పై మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం ను ఎంపిటిసి ల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు శుక్రవారం సందర్శించారు.ఈ వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలి వేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగను పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.ఈ సందర్భంగా మేము సైతం మిత్ర మండలి సభ్యులను,వారి సేవలను ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు,అభినందించారు.భవిష్యత్తులో వారి సేవలను మరింత విస్తరింప చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో మేము సైతం మిత్ర మండలి సభ్యులు రంగా.శ్రీనివాస రావు, సత్యనారాయణ శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.