UPDATES  

 మతోన్మాది బిజిపికే 2024 చివరి ఎన్నికలే డెడ్ లైన్

  • మతోన్మాది బిజిపికే 2024 చివరి ఎన్నికలే డెడ్ లైన్
  • మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారు
  • కర్నాటక ఫలితాలు మార్పుకు సంకేతం
    కేసిఆర్ తీరులో మార్పు రావాలి
  • జూన్ 4న జరిగే ప్రజాగర్జనకు లక్షలాదిగా తరలిరావాలి
    సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

కార్పొరేట్ దిగ్గజాలకు తొత్తుగా మారి దేశ సంపదను దోచిపెడుతూ, మతం, కులంపేరుతో ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బిజెపికి 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు చివరి ఎన్నికలని, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బిజెపికి పతనం ప్రారంభమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్బులో కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు, జూలూరుపాడు మండలాల సంయుక్త ప్రజాగర్జన సభ సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ దేశంలో ప్రజలకు రక్షణ లేక ప్రమాదంలో పడ్డారని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అందుకు సిపిఐ ముందు వరసలో ఉండి ప్రజలను చైతన్యం చేస్తూ బిజేపి హటావ్..దేశ్ కో బచావో అనే నినాదంతో పరిస్థితులను ప్రజలకు వివరించామన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులు బిజేపి పాలనలో పెరిగిపోయారని, వారంతా బిజేపి, ఆర్ఎస్ఎస్ శక్తులే అన్నారు. మహిళా రెజిలర్స్ రోడ్డెకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి అర్థమవుతోందన్నారు. దేశ ప్రజలకోసం కాకుండా రేపిస్టులకు, లక్షల కోట్లు ఎగనామం పెట్టే వారికి మోడి సర్కార్ బాసటగా నిలుస్తోందని విమర్శించారు. 40 శాతం అవినీతిలో కూరుకుపోయిన కర్నాటక ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు గద్దె దింపారని, దేశం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితులు స్పష్టమవుతున్నాయని , ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు. రాముని పేరుతో ప్రజలపై హిందుత్వాన్ని రుద్దదామని బిజేపి చూస్తోందని, రాముడంటే అందరికీ భక్తి ఉందని, కానీ ఈ దేశం సర్వమత సమ్మేళం అని చెప్పారు. లౌకిక వాదానికి తూట్లు పొడిస్తే సహించేది లేదని, అందుకు సిపిఐ పెద్దన్నపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గెద్దనెక్కి బిజేపి ఉద్యోగాలు కల్పించక పోగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వారి హక్కులను కాలరాశారని చెప్పారు. అదాని, అంబానీల జమం చేస్తూ దేశాన్ని కారు చౌకగా కార్పోరేట్ల చేతల్లో పెట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడి రంగం సిద్ధం చేసిందన్నారు. దేశాన్ని విచ్ఛినకర శక్తుల నుండి కాపాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు ప్రజలు ఏకం కావాలని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన తీరు మారాలని, బిజేపి తరహా నియంతపోకడ మానాలని చెప్పారు. ప్రజలు నేరుగా సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని సూచించారు. 11 లక్షల ఎకరాల పోడుభూములకు పట్టాలిస్తామని ప్రకటించిన కేసిఆర్ ఇప్పుడు ఆ సంఖ్యన తగ్గించారని, వాస్తప పరిస్థితిని గ్రహించాలని చెప్పారు. దీనిపై అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలను తీసుకోవాలని చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల చట్టాలను అమలు చేయాలనీ, జూనియర్ పంచాయితీ కార్మికులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని, విఓఏల సమస్యలను పరిష్కరించారని, అందరికీ న్యాయం జరిగేలా ప్రజాపాలన సాగించాలని కోరారు. కర్నాటక ఎన్నికలతో మార్పు మొదలైందని, ఇదేబాటలలో నడిచేందుకు దేశప్రజలు సిద్ధంగా వున్నారని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో బిజేపిని తరమికొట్టేందుకు సిపిఐ కంకణం కట్టుకుందని, అందుకు దేనికైనా సిద్ధమే అన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా గత నెల్లో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర ఎంతో ఉత్సాహ భరితంగా సాగిందని, మండుటెండను సైతం లెక్కపెట్టకుండా బిజేపి అవినీతి, అక్రమాలపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో విజయం సాధించామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదిన ప్రజాగర్జన పేరిట కొత్తగూడెం కేంద్రంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని, లక్ష మందిని కదిలించేందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ నాయకులు డి. రాజా, కె. నారాయణ, అజీజ్ పాషా పాటు చాడా వెంకటరెడ్డి, గోరేటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాసరావు తదితరులు హాజరవుతున్నారని, ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త నడుం బిగించాలని పిలుపునిచ్చారు. చంద్రగిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాధం, నరాటి ప్రసాద్, వై. శ్రీనివాసరెడ్డి, రేసు ఎల్లయ్య, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్, మండలాలు, పట్టణాల కార్యదర్శులు వి.పూర్ణచందర్ రావు, భూక్య దస్రు, వాసి రెడ్డి మురళి, బొర్రా కేశవరావు, ఊకే నారాయణ, జిల్లా సమితి సభ్యుల కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వట్టికొండ మల్లికార్జున్ రావు, దమ్మాలపాటి శేషయ్య, కుమారి హన్మంతరావు, జి.వీరాస్వామి, జి.రామనాధం, గెడ్డాడు నగేష్, ఉప్పుశెట్టి రాహుల్, వి.పద్మజ, కె.రత్నకుమారి, దీటి లక్ష్మీపతి, ఏం.ధనలక్ష్మి, వాగబోయిన రమేష్, జక్కుల రాములు, జడ శ్రీను, మునిగడప వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థలు, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !