- వారధి కట్టించిన సారధి రేగా
- రేగన్న సారథ్యంలో అభివృద్ధి పరుగులు*
- గుండాల,ఆళ్ల పల్లి మండలాల అభివృద్ధి బాసటగా రేగా
- హై లెవెల్ వంతెనల నిర్మాణంతో కష్టాలకు చెక్
మన్యం న్యూస్ గుండాల: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సారధ్యంలో గుండాల, ఆళ్ల పల్లి మండలాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది. రెండు మండలాల్లో వాగులపై హై లెవెల్ వంతెనలు నిర్మాణ పనులు కొన్ని ప్రారంభమై ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. గెలిచిన నాటినుండి రెండు మండలాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి పదంలో రెండు మండలాలను ముందు ఉంచే విధంగా ఆయన ఎన్నో ప్రణాళికలను రచించారు. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. గుండాల,ఆళ్ల పల్లి మండలాల్లో కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెనగలను గతంలో కొన్ని ప్రారంభించుకొని మరికొన్ని వాటికి శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు రెండు మండలాల్లో ప్రధాన వాగుల పై వంతెనలు పూర్తి కావడంతో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. గతవారం గుండాల ,ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించిన ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.కొమరారం నుంచి చెట్టుపల్లి రహదారిని ప్రారంభించి ఆ రహదారి గుండా బస్సు సౌకర్యం కూడా చిన్న వెంకటాపురం మల్లెల గుంపు వెళ్లే కిన్నెరసాని వాగుపై హై లెవెల్ వంతెన కోసం శంకుస్థాపన చేశారు గుండాల నుండి మఠం లంక వాగుకు వంతెన కోసం శంకుస్థాపనను కూడా పూర్తిచేసి పనులు ప్రారంభమయ్యాయి.అభివృద్ధికి నిదర్శనం మా ఎమ్మెల్యే అంటూ రెండు మండలాల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా రెండు మండలాలను రెండు కళ్ల భావించి అభివృద్ధి పదంలో అగ్రగామి నిలుపుతారని ప్రజలు , ప్రజా ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఉమ్మడి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న రేగా కాంతారావు బాసటగా నిలుస్తామని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు