UPDATES  

 ప్రజాపోరు యాత్ర స్పూర్తితో బహిరంగసభను జయప్రదం చేద్దాం*

ప్రజాపోరు యాత్ర స్పూర్తితో బహిరంగసభను జయప్రదం చేద్దాం*

బహిరంగసభ గోడపత్రిక ఆవిష్కరించిన సీపీఐ రాష్ట్ర సమితిసబ్యులు కె సారయ్య

*మన్యం న్యూస్,ఇల్లందు..రాష్ట్రవ్యాప్తంగాసీపీఐ పార్టీ నిర్వహించిన ప్రజాపోరు యాత్ర స్పూర్తితో కొత్తగూడెంలో జూన్ 4న జరిగే ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపిఐ రాష్ట్రసమితి సభ్యులు కె సారయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక విఠల్ రావు భవన్లో బహిరంగసభ గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… ప్రజాసమస్యల పరిస్కారం, పాలకుల ఎన్నికల హామీల అమలు, దేశ సమగ్రత, సమైక్యతకు రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలపాటు ప్రజాపోరు యాత్ర విజయవంతంగా కొనసాగిందని, ఆ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 36 బహిరంగ సభలు నిర్వహించి 1.70లక్షల మందికి పొరుయాత్ర లక్ష్యాన్ని చేరవేసి పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టగలిగామన్నారు. యాత్రల ముగింపులో భాగంగా లక్షమందితో ప్రజాగర్జన సభ నిర్వహించే లక్ష్యంతో పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. కేంద్రంలోని మతతత్వ బిజెపికి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో పతనం ప్రారంభమైందని, దీన్ని మరింత వేగవంతం చేసి కార్పొరేట్ బిజెపిని దేశంనుంచి తరిమేయాలని, అదే సమయంలో రాష్ట్రప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై హెచ్చరిక జారిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు బందం నాగయ్య, ఉడత ఐలయ్య, బొల్లి కొమరయ్య , ఎస్కే వళి, వేంకటేశ్వర్లు, ఆఫీస్ ఇంచార్జి వడ్లకొండ పొచయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !