మన్యం న్యూస్ వాజేడు.
మండలంలో తహశిల్దార్ కార్యాలయం ఎదుట కెసిఆర్ చిత్రపటానికి వీఆర్ఏ ల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎనలేని సేవ చేశారు. కష్టేఫలి అన్నట్లుగా వీఆర్ఏల కష్టానికి ఫలితంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పే స్కేల్ ఇవ్వనున్నట్లు, గురువారం జరిగిన మంత్రులతో కూడిన క్యాబినెట్ లో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.