మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 20
మణుగూరు మండలంలోనీ కూనవరం గ్రామానికీ చెందిన చీమల వెంకటేశ్వర్లు వృత్తి ట్రాక్టర్ డ్రైవర్,గత నాలుగు సంవత్సరాలుగా పక్ష వాతం వ్యాధి తో బాడపడుతూ, శుక్రవారం రాత్రి మరణించారు. చీమల.వెంకటేశ్వర్లు అతి నిరుపేద కుటుంబం కావడం తో దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మేము సైతం దృష్టికి తీసుకరాగా వెంటనే స్పందించిన మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మంగి.మల్లికార్జున్ చేతుల మీదుగా 3000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. అనంతరం కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్ కూడా వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్,వంక కృష్ణార్జున రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని. రామచంద్రయ్య,జట్టుపతి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.