మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 20, జూలూరుపాడు మండల కేంద్రంలో బస్టాండు, పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆధ్వర్యంలో శనివారం ఎండిఓ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా పంధా మండల కార్యదర్శి బాణోత్ ధర్మ, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకుడు గోపాలరావు లు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కన బస్టాండ్, చండ్రుగొండ రహదారి పక్కన బస్టాండ్లు ఉన్నప్పటికీ, రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేసారని, బస్టాండ్ లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం సమయంలో మరి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రయాణికుల పట్ల ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. అదే విధంగా మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో మండల కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమి లో తక్షణమే నూతన బస్టాండ్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించేందుకు కృషి చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో తీవ్రతరమైన ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారుపల్లి బాబురావు, మండలాల కృష్ణయ్య, తోటకూరి, నరేష్, జగదీష్ , కంగాల వెంకటమ్మ, ఈశ్వర్ సీతారాం, బీమా తదితరులు పాల్గొన్నారు