UPDATES  

 భద్రాద్రి జిల్లాలో నకిలీ విత్తన రైతు జిల్లాగా తీర్చిదిద్దుదాం నకిలీ విత్తనాల విషయంలో ఎవరిని ఉపేక్షించం

  • భద్రాద్రి జిల్లాలో నకిలీ విత్తన రైతు జిల్లాగా తీర్చిదిద్దుదాం
  • నకిలీ విత్తనాల విషయంలో ఎవరిని ఉపేక్షించం
  • జిల్లా అంతటా తనిఖీలు ముమ్మరం చేయండి
  • జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

భద్రాద్రి జిల్లాను నకిలీ విత్తనాలు విక్రయించని జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు శనివారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వానాకాలం సాగుకు సమాయత్తం,నకిలీ విత్తనాలు నియంత్రణ, ఆయిల్పామ్ సాగు తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన, సహాకార, విత్తన, ఎరువుల
వ్యాపారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలి విత్తనాలు విక్రయించేవ్యక్తులపై పిడి యాక్టు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తదుపరి ప్రభుత్వంచేపట్టిన చర్యలు ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, రైతుబందు, రైతుభీమా అమలు వల్ల నేడు మన రాష్ట్రం దేశంలో పెద్దఎత్తున
వరి పండిస్తున్న రాష్ట్రంగా నిలిచినట్లు తెలిపారు. తెలంగాణ సీడ్ కార్పోరేషన్ సరఫరా చేసిన విత్తనాలను మాత్రమే రైతులువినియోగించాలని చెప్పారు. లైసెన్సు కలిగిన వ్యాపారుల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు
చేసిన విత్తనాలకు రశీదులు బద్రపరచాలని సూచించారు. విత్తనాలు కొనుగోలులో నిశిత పరిశీలన చేయాలని, వ్యవసాయఅధికారుల సలహాలు, సూచనలు పాటించాలని అన్నారు. విత్తనాలు కొనుగోలులో గడువు పరిశీలన చేయాలని
చెప్పారు. లైసెన్సులు లేకుండా విక్రయాలు విక్రయించడం నేరమని, అలాంటి వారిపై పిడి యాక్టు అమలు చేస్తామని హెచ్చరించారు. రైతు వల్లే నేడు మనం జీవించగలుగుతున్నామన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని, రైతుకు నష్టం వాటిల్లితే
ప్రజలకు తిండి దొరకదని, అన్నం పెట్టే రైతును మోసం చేసి ఉసురు కట్టుకోవద్దని ఆయన పేర్కొన్నారు. నకిలీ విత్తనాలువిక్రయించడం వల్ల అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చన్న ఆలోచనలో మార్పులు రావాలని ఆయన చెప్పారు. విత్తనాలు,
ఎరువులు విక్రయాల నమోదు స్టాకు రిజిష్టరు పకడ్బందిగా నిర్వహించాలని చెప్పారు. టాస్క్ ఫోర్సు టీములు,వ్యవసాయ అధికారులు ప్రతి దుకాణాన్ని తనిఖీ చేయాలని చెప్పారు. వరి పంటకు ప్రత్యామ్నయ పంటలు సాగు చేపట్టువిధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఉద్యాన పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని,
అందువల్ల రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని సూచించారు. పంటల్లో మోతాదును మించిఎరువులు, రసాయన మందులు వాడొద్దని, దాని వల్ల పంటకు, అలాగే భూ సాంద్రత తగ్గిపోయో ప్రమాదం ఉన్నట్లుచెప్పారు. వ్యవసాయం వృద్ధి వల్ల ఆ కుటుంబమే కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు కారణమవుతుందని
చెప్పారు. గ్రామాలలో మధ్యవర్తులు, దళారులు రైతులకు నకిలి విత్తనాలు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటారని జాగ్రత్తగాఉండాలని చెప్పారు. గుంటూరు, బాపట్ల తదితర ప్రాంతాల దళారులు గ్రామ రైతులను లక్ష్యంగా చేసుకుని కమిషన్
ఇస్తూ ఆ గ్రామ రైతులతోనే నకిలీ విత్తనాలు విక్రయాలు చేస్తుంటారని అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలనిచెప్పారు. నిషేదిత కలుపుమదు గ్లైపోసెట్ వాడట వల్ల భూమి నిస్సారం అవుతుందని, తద్వారా పంట దిగుబడితగ్గిపోతుందని చెప్పారు. నిషేధిత మందులు వినియోగం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులకు గురవుతారని చెప్పారు.
హెచ్ఐ కాటన్ (హెర్బిసైడ్ టాలరెంట్) విత్తనాలు విక్రయానికి అనుమతి లేదని నిషేదిక విత్తనాలను రైతులు సాగుచేయొద్దని చెప్పారు. సలహాలు, సూచనలు, పిర్యాదులు కొరకు ఏర్పాటు చేసిన కంట్రోల్ నెంబర్ 7288894276
ఫోన్ చేసి వివరాలను తెలిచేయాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు డీలర్లు దుకాణం పేరు, స్టాకు, ధరల పట్టిక, లైసెన్సు వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలని చెప్పారు. ఆయిల్ దిగుమతి
నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రభుత్వం మన జిల్లాకు 21,100 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించిందని, లక్ష్యం సాధించు విధంగా ఉద్యాన, వ్యవసాయ అధికారులు కృషిచేయాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన వానాకాలం సాగుకు సమాయత్తం 2023 కరపత్రాన్ని
ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, సహాకార అధికారివెంకటేశ్వర్లు, ఏడిలు లాల్చంద్, రవికుమార్, అల్జీల్బేగం, సుధాకర్, కరుణశ్రీ, వాసవిరాణి, మండల వ్యవసాయ
అధికారులు, విత్తన, ఎరువుల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !