UPDATES  

 ప్రజా సేవకుని నేను 5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో కొత్తగూడెం

  • ప్రజా సేవకుని నేను
  • 5 దశాబ్దాల రాజకీయ చరిత్రలో కొత్తగూడెం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు
  • మనసున్న మారాజు ముఖ్యమంత్రి కేసీఆర్
  • రూ.215 కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి
  • ఆత్మీయ సమ్మేళనలో కొత్తగూడెం శాసనసభ్యులు వనమా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తన ఐదు దశాబ్దాల చరిత్ర రాజకీయ చరిత్రలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలలో నడిపించిన ఘనత తనకే దక్కిందని మనసున్న మహారాజు ముఖ్యమంత్రి సారధ్యంలో రూ. 210 కోట్ల రూపాయలను మంజూరు చేసి పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామా టాకీస్ ఏరియాలో కొత్తగూడెం మున్సిపాలిటీలోని 10 వార్డుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కొత్తగూడెం నైసర్గిక స్వరూపం తనకు మొత్తం తెలుసునని తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎమ్మెల్యేగా మంత్రి గా, సర్పంచిగా పంచాయతీ బోర్డు మెంబర్గా అనేక పదవులను అలంకరించి కొత్తగూడం నియోజకవర్గ ప్రజలకు సేవ చేశానని ప్రజలు తాను చేసిన అభివృద్ధిని గుర్తించి గుండెల్లో పెట్టుకొని మళ్ళీ వనమే రావాలి వనమే గెలవాలి అంటూ చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గంలో జీవో నెంబర్ 76 కిన్నెరసాని జలాలు అంతర్గత రోడ్లు మొర్రేడు రామవరం ప్రాంతాలలో బ్రిడ్జిలు రైల్వే ఆర్డర్ బ్రిడ్జి తన హయాంలో నిర్మించడం ఎంతో మర్చిపోలేని చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోయింది అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి కొత్తగూడెం పట్టణానికి తాగునీరు అందించిన ఘనత తనకే దక్కిందన్నారు. గడిచిన 10 రోజుల క్రితం సాంకేతిక లోపంతో చాంగనీరు అందగా కొత్తగూడెం పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉందని అయితే తమ ప్రజాప్రతినిధులతో కలిసి ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్దెనందుకు తాము స్వయంగా అడవిలోనే ఉండాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మున్సిపల్ కౌన్సిలర్ తో కలిసి కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రతి ఇంటి గడప తడతానని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం తద్యమన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ తరఫున నిలబడేది నేనే ప్రత్యర్థులపై కలబడేది నేనే ప్రజలు గెలుపు తీర్పు ఇచ్చేది తనకేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ ఎమ్ఏ రజాక్ కాసుల వెంకట్, కోలాపురి ధర్మరాజు అఫ్జల్ ఉన్నిసా బేగం అంబుల వేణు, కాపు కృష్ణ, పల్లపు లక్ష్మణ్ ,దుంపల అనురాధ,పోస్ట్ ఆఫీస్ వాసు, కనుకుంట్ల పార్వతి, నక్క సృజన, రెహమాన్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !