మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 21::
జూన్ 4 కొత్తగూడెంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాగర్జన సభను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ పిలుపునిచ్చారు. మండలంలోని రాయిగట్ట గ్రామంలో ప్రజా గర్జన సభ బ్రోచర్‌ను రాష్ట్ర నాయకులు కల్లూరు వెంకటేశ్వరరావు తో కలిసి ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు సాగులో ఉన్న కోడు పట్టాలు అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అలానే తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలందరూ అమలు చేయాలని పలు డిమాండ్లతో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు మూడు మండలం నుంచి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సభ్యులు నోముల రామిరెడ్డి బల్ల సాయికుమార్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి తాటిపూడి రమేష్ వీరమ్మ సతీష్ రాధ వంశీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు