మన్యం న్యూస్ దుమ్ముగూడెం మే 21::
మండల పరిధిలోని నడికుడి ప్రధాన రహదారి లో వేంచేసి ఉన్న మహంకాళి చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్న భద్రకాళి అమ్మవారికి ఆదివారం నాడు భద్రాచలం వాస్తవ్యులు రిటైర్డ్ ఎస్సై మల్లుల వెంకట రామారావు చంద్రకళ దంపతులు బంగారు పు నేత్రాలు కళ్యాణ బొట్టు పట్టు వస్త్రాలను పురోహితులు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో బహుకరించారు అనంతరం ఆలయ పురోహితులు యశ్వంత్ శర్మ వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆపక శంకర్ రత్తమయ్య రాముడు కల్లూరి వెంకటరమణ తిరుపతిరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.