మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆంజనేయ విగ్రహ ప్రతిష్ట
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ చేసిన ముస్లిం సోదరులు
మన్యం న్యూస్ గుండాల..ఆళ్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో మతసామరస్యం వెల్లి విరిసింది. విగ్రహ ప్రతిష్టకు వచ్చే భక్తుల కోసం ఆళ్లపల్లి ముస్లిం సోదరులు మజ్జిగతో పాటు చల్లటి మంచినీరును అందించారు. ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల ప్రజలు ముస్లిం సోదరులు చేస్తున్న కృషిని అభినందించడంతోపాటు వారిని పొగడ్తలతో ముంచెత్తారు. అన్ని మతాలు అన్ని కులాలు సమానమే అనటానికి ఈ ఒక్క సందర్భమే నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.
