UPDATES  

 భద్రాద్రి కేరాఫ్ అభివృద్ధి! పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణం గురించి అధికారులను ఆదేశించిన పెద్దసార్!

  • భద్రాద్రి కేరాఫ్ అభివృద్ధి!
  • పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణం గురించి అధికారులను ఆదేశించిన పెద్దసార్!
  • బిజేపి ప్రభుత్వం ఉలిక్కిపడేలా బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు
  • నెర్రబారిన చెరువులకు జీవం పోసిన మిషన్ కాకతీయ
  • తెలంగాణ అభివృద్ధి మోడల్ అలా.. గుజరాత్ అభివృద్ధి మోడల్ డొల్ల..
  • బిజేపి పుణ్యమా అని తిరోగమనం వైపు భారతదేశం!
  • ప్రజా అవసరాలను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం.
    పినపాక నియోజకవర్గంలోని గోదావరి పరివాహక మండలాలకు పెద్ద సార్ ఆదేశాలతో కరకట్ట నిర్మాణం
  • గోదావరి వరద బాధితుల పరిహారం అతి త్వరలో విడుదల…
    ఫేస్బుక్ సాక్షిగా వెల్లడించిన ఎమ్మెల్యే రేగా…..

మన్యం న్యూస్, పినపాక :

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్బుక్ సాక్షిగా బిజేపి ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తుంటే మోడీ మానస పుత్రిక గుజరాత్ పాలనలో, అభివృద్ధిలో వెనకబడి ఉందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఉలిక్కిపడేలా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించబోతున్నదని, తెలంగాణ అభివృద్ధిని గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిరాశ నిస్పృహతో ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడువారిన చెరువులకు మిషన్ భగీరథ ప్రాణం పోసిందని, ఇంత ఎండాకాలంలో సైతం ప్రతి చెరువు నీటితో కలకలలాడుతుందని అన్నారు. నేను కలలు కన్నా పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణం గురించి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. పులుసు బొంత సాకారంతో కరకగూడెం మండలాన్ని సస్యశ్యామలం చేయబోతున్నానని అన్నారు. రూ 2వేల రూపాయల నోటును నిలిపివేయడంతో భారతదేశం మళ్లీ 60 సంవత్సరాల వెనుకకు వెళ్తుందని ఏద్దేవా చేశారు. భారత దేశ ప్రజల అవసరాలను గుర్తించడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రత్యామ్నాయంగా బిఆర్ఎస్ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గడిచిన వర్షాకాలంలో పినపాక నియోజకవర్గం లోని పలు మండలాలు వరద తాకిడికి గురయ్యారని, వారి సంరక్షణ కోసమే తనకంట నిర్మాణము చేపట్టబోతున్నామని, పరిహారం కింద ఎవరి ఖాతాలోనైతే డబ్బులు జమ కాలేదో వారికి పదివేల రూపాయలను ఇవ్వబోతున్నామని, తెలియజేశారు. పినపాక నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచానో ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అభివృద్ధికి ఆనవాలుగా మారనుందని తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !