కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
మన్యంన్యూస్,ఇల్లందు :ఇల్లందు పట్టణ , మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దొడ్డ డేనియల్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం జగదంబ సెంటర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…దేశం కోసం, పేద బడుగు, బలహీన మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని అదేకాకుండా కంప్యూటర్ ను భారతదేశానికి పరిచయం చేసారని అంతటి గొప్ప నాయకుడు నేడు మనమధ్య లేకపోయినా ఆయన చూపిన మార్గంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నడవాలని ఆయన స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, మండల అధ్యక్షులు పులి సైదులు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ హరికృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జాఫర్, పట్టణ ఉపాధ్యక్షులు జెట్టి కిషోర్, ఐజాక్, పట్టణ మైనార్టీ నాయకులు మసూద్, ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు లింగాల జగన్నాథం, కే లక్ష్మణరావు ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు మహమూద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవి భద్రం, ఈశ్వర్ గౌడ్, గడ్డి శ్రీను, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు గాలిపల్లి స్వరూప, ఎం నిర్మల, మహేందర్ రెడ్డి, ఖాయం వెంకటేశ్వర్లు, కృష్ణ, సోను లోడ్, ఎం శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
