UPDATES  

 బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో వికలాంగులకు ఆర్టీసీ బస్సు పాస్ లు పంపిణీ -బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 21

మణుగూరు పట్టణం లోని, గాంధీ బొమ్మ సెంటర్ లో టిఎస్ ఆర్టిసి ఆధ్వర్యంలో వికలాంగులకు 50 శాతం రాయితీతో బస్ పాసులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 50 శాతం రాయితీ మినహా మిగిలిన 50 శాతం డబ్బులు చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మణుగూరు లోనీ వికలాంగులు అందరికీ 50 శాతం డబ్బు చెల్లించి బస్సు పాస్ లు ఇప్పిస్తామని బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్.రాజు తెలిపారు.ఈ మేరకు ఆదివారం నాడు మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు పాకాల రమాదేవి చేతుల మీదగా 10 మందికి 50 శాతం డబ్బు చెల్లించి పాసులు పంపిణీ చేయడం జరిగింది అని వారు తెలిపారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో వికలాంగులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అన్నారు. వికలాంగులకు 3 వేల రూపాయల పింఛన్లు,ట్రై సైకిల్ పంపిణీ,కేసీఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమం ద్వారా బైక్ లను అందజేయడం జరుగుతుందన్నారు.సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎన్ ఎన్ రాజు తెలిపారు.మణుగూరు ప్రాంతం లోని వికలాంగులు అందరికీ కూడా బిఅర్ఎస్వీ అధ్వర్యంలో 50 శాతం డబ్బు చెల్లించి పాస్ లు ఇప్పిస్తామన్నారు.ఈ అవకాశాన్ని వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాకాల రమాదేవి,చంద్రకళ, తోట.వీరస్వామి,ఆర్టీసీ సిబ్బంది ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !