UPDATES  

 పారిశుధ్యం,పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి.

  • పారిశుధ్యం,పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి.
  • పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • ప్రజల ఆరోగ్య కోసం ప్రత్యేక డ్రైవ్
  • -కూనవరం సర్పంచ్ ఏనిక. ప్రసాద్

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 22

మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయతీ లో పారిశుధ్యం,పరిశుభ్రత, పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం పంచాయతీ పరిధిలోని రేగుల గండి వలస ఆదివాసీ గ్రామం లో స్థానిక సర్పంచ్ ఏనిక ప్రసాద్,జీ పి కార్యదర్శి వి. సంధ్యరాణి ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ నిర్వహించారు.వీధులకు ఇరువైపులా వున్న చెత్తను తీపించి,శుభ్రం చేపించారు. స్కూల్ అవరణలో,అంగన్వాడీ కేంద్రంలో,పల్లే ప్రకృతి వనం లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పిచ్చి మొక్కలను,చెత్తను దగ్గరుండి శుభ్రం చేపించారు.గ్రామంలో తడి పొడి చేత నిర్వహణ పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఇంటింటికీ సేకరించిన తడి పొడి చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి పొడి చెత్తను,తడి చెత్తను వేరు చేసి తడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువు తయారు చేయవచ్చన్నారు.స్థానిక ప్రజలను డంపింగ్ యార్డుకు తీసుకు వెళ్లి,వారికి దాని నిర్వహణ పద్దతిని వారికి చూపించి,వివరించడం జరిగింది అన్నారు.ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ పారిశుద్యం పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని వారికి తెలియజేయడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎలిబోయిన లక్ష్మయ్య,ఏనిక. ముత్తయ్య,పుట్టి ఇజ్రాయిల్, ఏనిక చిట్టయ్య,పాయం కృష్ణారావు,ఏనిక కోటయ్య, వజ్జా జంపయ్య,కుంజా. సారయ్య,బురక బొడమ్మ, సున్నం.సావిత్రి,ఏనిక లక్ష్మి, కంగాల చంద్ర కళ,సపక. భారతి,మిదిదొడ్ల సరిత,మర్రి శెట్టి కాంతమ్మ,ఇమ్మడి పద్మ, తెల్లం సరోజిని,పాయం తులసి, ఏనిక.బాయమ్మ,సున్నం.లక్ష్మి,ఏనిక లక్ష్మి కాంతం,జీపి సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !