*ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం.
*జిల్లా ప్రజలు వినియోగించుకోవాలి.
*స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
క్యాన్సర్ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించుకొని తగిన చికిత్స చేయించుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్ అన్నారు.
సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ప్రతిమ హాస్పిటల్ వైద్య బృందం చే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్. శాసనసభ్యురాలు ధనసరి అనసూయ సీతక్క, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్,జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఐ టీ డీ ఏ పి ఓ అంకిత్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇలా త్రిపాఠి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారించుకొని క్యాన్సర్ అనే మహమ్మారిని రూపుమాపడానికి బహుత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా యంత్రాంగానికి, ప్రతిమ వైద్య సిబ్బంది సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
అందులో భాగంగానే గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ప్రతిమ హాస్పిటల్ వైద్య బృందం చే క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయటం చాలా సంతోషం అన్నారు. ప్రతిమ హాస్పిటల్ వైద్య బృందం జిల్లాను దత్తత తీసుకుంటే అధికార యంత్రాంగం అంతా అండదండలుగా ఉంటారని అన్నారు.
ఈ సదా అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.ఉచితంగా క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేయటం జిల్లాలో చాలా సంతోషమని ఆమె ఆనంద వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు వైద్య పరీక్షల కోసం హైదరాబాదు, హనుమకొండ లాంటిపట్టణాలకువెళ్లిచేయించుకోలేకపోతున్నారన్నారు.అలాంటి వారికి ఇలాంటి శిబిరాలు చాలా దోహద పడతాయని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ. క్యాన్సర్ తో బాధపడే వారి కోసం ఉచిత మెగా క్యాన్సర్ శిబిరం ఏటూరు నాగారం సామాజిక వైద్యశాలలో 22, 23, 24 తేదీలలో నిర్వహించబడునున్నట్లు కలెక్టర్ తెలిపారు.అన్ని రకాల తోడుపాట్లను ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 45 సంవత్సరాలు పైబడిన స్త్రీలు ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ నిర్ధారించుకున్నట్లయితే వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రతిమ హాస్పిటల్ సంసిద్ధంగా ఉందన్నారు.ఈ సదవకాశాన్ని జిల్లాలోని మహిళలు పురుషులు గొంతు, ఊపిరితిత్తులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా వ్యవసాయ సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, జడ్పి కోఆప్షన్ మెంబర్ వలియాబి, ఎంపీపీ విజయ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, జడ్పి సీఈవో ప్రసూన రాణీ, డిపిఓ వెంకయ్య,సర్పంచ్ రామ్మూర్తి, సి.హెచ్.సి సూపరిండెంట్ డాక్టర్ సురేష్,తహసిల్దార్ లక్ష్మణ్, ప్రతిమ హాస్పిటల్ వైద్య బృందం డాక్టర్ ప్రతీక్, డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమిత్ర, తదితరులు పాల్గొన్నారు.