UPDATES  

 యువత క్రీడల పోటీలలో రాష్ట్రస్థాయిలో రాణించాలి*

 

*మూడు రోజుల పాటు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు.

*జిల్లా స్థాయి సీఎం కప్ 2023 క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించిన.రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం

మారుమూల జిల్లా అయినా ములుగు జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు.సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో 3 రోజుల పాటు నిర్వహించు జిల్లా స్థాయి సీఎం కప్ 2023 క్రీడా పోటీలను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్,జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్, జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్,ఐటీడీపీఓ అంకిత్, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. క్రీడ పోటీల కు ముందు జాతీయ గీతాలాపన చేశారు.అనంతరం క్రీడాకారులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దూర దిష్టితో రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీర్చిదిద్దుతున్నారని
అన్నారు. కుసుమ జగదీష్ ఎన్నో త్యాగాలు చేశారని వారి సేవలను కొనియాడారు.
జగదీష్ లాంటి వ్యక్తి జిల్లా చైర్మెన్ గా ఉండటం చాలా సంతోషమని ఆయన ఆనంద వ్యక్తం చేశారు. ఏటూరు నాగారం లాంటి చైతన్య ఉన్న ప్రాంతంలో ఏకలవ్య లాగా ఆడే 5000 మంది క్రీడాకారులు సీఎం కప్ పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో క్రీడాకారులకు ఎన్నో స్పాన్సర్స్ వస్తున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని, జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన
క్రీడాకారులకు కోటి రూపాయలు వారికి సహాయం అందిస్తూ జూబ్లీహిల్స్ బంజర హిల్స్ లాంటి ఏరియాలో వారికి ఇంటి స్థలాలు కూడా సమకూరుస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు.ఈ రాష్ట్రంలో 17వేల గ్రామాల్లో తెలంగాణ క్రీడ మైదానాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఎన్నో ప్రణాళికలతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని సీఎం సేవలను కొనియాడారు.రాష్ట్ర ఏర్పడక ముందుకు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతం అన్నపూర్ణంగా ఉండేదని, ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారిందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జడ్పీ పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ.క్రీడా మైదానాలు ప్రతి ఊరిలో నెలకొల్పామన్నారు.క్రీడా మైదానాల్లో ఆటలు మానసిక ఉల్లాసనికి దోహదపడుతున్నారు.ఈ జిల్లాకు క్రీడాకారులు మంచి పేరు తీసుకువచ్చి రాష్ట్రస్థాయిలో కూడా రాణించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ. మానసిక ఉల్లాసం కల్గించే క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. మన జిల్లాలో మే 15 నుంచి 17 వరకు అన్ని మండలాల పరిధిలోని గ్రామీణ ప్రజలను, యువతను భాగస్వామ్యం చేస్తూ 5 రకాల క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అత్యంత ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో లో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులకు టిఫిన్,చల్లని త్రాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా స్థాయిలో 3 రోజులు నిర్వహించి, విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని కలెక్టర్ తెలిపారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు రవాణా సౌకర్యం భోజన వసతులు ఏర్పాటు చేశామన్నారు.జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయిలో ఎంపికై జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు. సీఎం కప్ క్రీడా పోటీలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు
జిల్లా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని, ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, మండల స్థాయిలో జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు అందించిన సహకారం ప్రశంసనీయమని, జిల్లా స్థాయిలో మూడు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటూ విజయవంతంగా క్రీడా పోటీలను నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ యువతీ, యువకులు క్రీడా స్పూర్తి తో పోటీలలో పాల్గోనాలని, క్రీడాకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ,జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్,జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా గ్రంధాలయ చైర్మన్ గోవింద నాయక్ ఐటీడీపీఓ లతో కలిసి సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలలో భాగంగా వాలీబాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్, జిల్లా వ్యవసాయ సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,జడ్పి కోఆప్షన్ మెంబర్ వలియాబి,ఎంపీపీ విజయ,జడ్పి సీఈవో ప్రసూన రాణీ, జిల్లా యువజన క్రీడా అధికారి పివిఆర్ చారి,డిపిఓ వెంకయ్య, సర్పంచ్ రామ్మూర్తి, తహసిల్దార్ లక్ష్మణ్,అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !