మన్యం న్యూస్ చండ్రుగొండ మే 22 : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు సిఐ వసంత్ కుమార్ స్పష్టం చేశారు.సోమవారం స్థానికంగా గల ఎరువులు, విత్తనాల దుకాణాలను వ్యవసాయ,పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా విస్తృతంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ వసంత్ కుమార్ మాట్లాడుతూ…ప్రభుత్వం గుర్తింపు కలిగిన కంపెనీల విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఏ కంపెనీ విత్తనాలను ఎంత మంది రైతులకు విక్రయించారు. అనే విషయాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లల్లో నమోదు చేసుకోవాలన్నారు. విత్తనాలు వివరాలు పారదర్శకంగా ఉండేలా డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.విత్తనాలు అమ్మిన రైతులకు రసీదులు ఇవ్వాలన్నారు. అన్నపురెడ్డిపల్లి చండ్రుగొండ మండలాలకు సంయుక్తంగా బూర్గుడెం వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అశ్వరావుపేట ఏడిఏ అబ్దుల్ బేగం, ఏవో వినయ్, ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.