మన్యం న్యూస్, పినపాక:
దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన సంఘసంస్కర్త మాదిరి భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు పినపాక మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి కోసం ఆనాడు హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలను స్థాపించాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.