UPDATES  

 ఉద్యోగివా.. ఉన్మాదివా.. ఉచిత సలహాలువద్దు ఉద్యోగం చేసుకో

  • ఉద్యోగివా.. ఉన్మాదివా..
  • ఉచిత సలహాలువద్దు ఉద్యోగం చేసుకో
  • ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఎమ్మెల్యే వనమాపైనే సెటైర్ల
  • మింగిన కోవిడ్ డబ్బులు కక్కిస్తాం
  • ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రా..
  • ఎమ్మెల్యే వనమా సత్తా ఏంటో తెలుస్తది
  • శాశ్వత రిటైర్మెంట్ నీకే దగ్గరలో ఉంది
  • రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువు చేసుకుంటూ
రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఏమి అర్హత ఉందని నోరు అదుపులోకి పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ పై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రం వ్యక్తం చేశారు. ఇటీవల ఉలవనూరులో జరిగిన ఓ కార్యక్రమంలో గడల శ్రీనివాస్ ఎమ్మెల్యే వనమాపై వ్యాఖ్యానిస్తూ వయస్సు అయిపోయింది ఇక రాజకీయాన్ని వదిలి రెస్ట్ తీసుకోమని చెప్పడం వివాదాస్పదంగా మారింది ఈ విషయంపై సోమవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో ఖండించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా పనిచేస్తున్న గడల శ్రీనివాస్ ఉద్యోగి లేక ఉన్మాదుల మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా గడిచిన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని 19 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తూ ప్రజల మనలతో 18 సంవత్సరాలు సర్పంచ్ ,నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వనమా పైనే విమర్శలు చేయడం సూర్యునిపై ఉమ్మేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్కే అబ్బాస్ పాలు తీస్తున్న గడల శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగిగా అనర్హుడని అన్నారు. ప్రజాసేవ చేయాలని సత్తా ఉంటే తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి స్వచ్ఛందంగా రాజకీయాలకు వచ్చి సేవ చేయలే తప్ప ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గడల శ్రీనివాస్ కరోనా కష్టకాలంలో ప్రజాధనాన్ని దిగమింగున సంగతి అందరికీ తెలిసిందని కరోనా సొమ్మును కక్కించి తీరుతామని హెచ్చరించారు. జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటూ నీతిపాలన రాజకీయాలను చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న గడల శ్రీనివాస్ పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. గడల చేస్తున్న నక్కజిత్తుల వినియాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ గడపగడపకు వెళ్లి అడిగిన వనమా చేసిన అభివృద్ధి ఇట్టే చెబుతారని సవాల్ విసిరారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హెల్త్ డైరెక్టర్ పదవిలో ఉన్న గడల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార పార్టీ శాసనసభ్యుల మీద విమర్శలు చేయడం దివాలా కోరు విధానానికి నిదర్శనమని చేశారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అవినీతిపై సిబిఐ సిబిసిడిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాసేవ ముసకులు కొత్తగూడెం నియోజకవర్గంలో పగటి వేషగాడిగా అవతారమెత్తిన గడల శ్రీనివాస్ రోజుకు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ విమర్శలకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని లేకపోతే కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగుపెట్టనీయమని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్వాలశ్రీనివాస్, నాయకులు ఎం ఏ రజాక్ కాసుల వెంకట్ మండేవీరహనుమంతరావు బీమా శ్రీధర్, కిలారి నాగేశ్వరరావు బరపాటి వాసుదేవరావు ఎంపీపీలు సోనా ,విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ బొకే రాంబాబు కౌన్సిలర్ కోలాహపురి ధర్మరాజు పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !