- దశాబ్ది సంబరాల ఉత్సవాలు.. అంబరాన్నంటాలి
- సాధించిన రాష్ట్ర ప్రగతి సగర్వంగాచెప్పుకుందాం
- పండుగ వాతావరణంలో పల్లెలన్నీ వికసించాలి
- బాధ్యతగా పాల్గొందాం దశాబ్ది సంబరాలను విజయవంతం చేద్దాం
- విలేకరుల సమావేశంలో..
జిల్లా అధికార ప్రతినిధులు, అన్వర్ పాషా, గిరిబాబు
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ కెరటంల ప్రతి ఒక్కరూ నినదించి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలోతెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించిందని రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుని 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రభుత్వం విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని జిల్లా అధికార ప్రతినిధులు ఎస్కే అన్వర్ పాషా, లావుడియా గిరిబాబు, తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మోరే భాస్కర్లు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దశాబ్ది ఉత్సవ సంబరాలు పల్లె స్థాయి నుంచి పట్టణాల వరకు పండగ వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రగతిని చాటి చెప్పాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేడు తెలంగాణ రాష్ట్రంని దేశం కూడా చూస్తుందని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టేందుకు ఆలోచిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు దేశానికి రోల్ మోడల్ గా నిలిచిపోయాయని యావత్తు దేశం సైతం తెలంగాణ వైపుకు చూస్తుందంటే కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కోసం ప్రతి కార్యకర్త ప్రజాప్రతినిధులు తెలంగాణ వాదులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని జూన్ రెండవ తేదీ నుంచి 21 రోజులు పాటు జరిగే ఈ దశాబ్ది ఉత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాలని వారు కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ కర్నే మురళి, గులాబీ యువసైన్యం కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు పోతురాజు రవి, పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.