మన్యం న్యూస్, పినపాక:
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతీ బూత్ లో ముఖ్య కార్యకర్తల, నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు . బిఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసిఆర్ వల్ల ఏర్పడ్డ తెలంగాణ ఈ రోజు అభివృద్ది సంక్షేమం లో అద్భుతాలు సృష్టిస్తూ, యావత్ దేశం మన వైపు చూస్తుంది అని అన్నారు. తెలంగాణ దేశానికే మోడల్ కావాలని దానికోసం దేశానికి కేసిఆర్ నాయకత్వం కోరుకుంటుంది అని, మన నాయకుడి ఆలోచనలతో ప్రవేశపెట్టిన ఏ పథకమైన ప్రజానీకానికి చేరిందని అన్నారు. దేశం గర్వించదగ్గ మన పాలను ప్రవేశపెట్టి ప్రజల ఆధరణ అందుకున్న ఏకైక రాష్ట్రం మనదే అది మనకు గర్వకారణం అని అన్నారు.60 యేండ్ల ఆకాంక్షలను 9ఏళ్ల లో మన ప్రభుత్వం సాధించిన గొప్పతనాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని, అందుకే గ్రామ, గ్రామంలో 21 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, బూత్ ఇంచార్జిలు ఎవరి బస్తిలలో వారు ముందస్తు ప్రణాళిక చేసుకొని కార్యక్రమాలు చేయాలని కోరారు.