మన్యం న్యూస్, దమ్మపేట, మే, 22: దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామం లో నాభిశీల (బొడ్రాయి), గ్రామ దేవత ముత్యాలమ్మ, జంట నాగులు, పోతురాజు, అభయ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరబద్రం పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాల లో వేద బ్రాహ్మణులు మంత్రోచ్చరణ తో ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం అలయ అభివృద్ధి కి రూ.5116 రూపాయిలు కమిటీ సభ్యులకు అందజేసి గ్రామస్థులు సుభిక్షంగా సుఖశాంతులుతో, ఆయురారోగ్యములతో వర్ధిల్లాలి అని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోర్సా సాగర్, కాకా శివ శంకర్ ప్రసాద్, కాకా వెంకటేష్, కాకా రాము, పద్దం అశోక్, సూర్య, పానం ధర్మయ్య, తనికెళ్ళ యేసుపాదం, దేవరకొండ చెన్నారావు, కొండ్రు రంగా, కొండ్రు ఆనంద్, కుంజా పోలబాబు, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ వాడే వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.