నకిలీ విత్తనాలు అమ్మితే పిడి యాక్ట్ కేసు నమోదు చెస్తాం.
వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ
*రైతులకు నన్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించాలి.
ఎస్ఐ జీవన్ రాజు
మన్యం న్యూస్ కరకగూడెం:రైతులకు నన్యమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు అందించాలని వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ,కరకగూడెం ఎస్ఐ జీవన్ రాజు అన్నారు.మంగళవారం మండల పరిదిలోని కొన్ని పెర్టిలైజర్ దుకాణలని వ్యవసాయ శాఖ సిబ్బంది,పోలీస్ సిబ్బంది కలిసి తనికి నిర్వహించారు.ఈ సందర్భంగా షాపులలో ఉన్న రికార్డు లను పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు నన్యమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు అందిచాలని,లేనియోడల పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదులు పొందాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా రైతుల వద్దకు వచ్చే విత్తనాలు ఇస్తాం అని చెప్పినట్టయితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రైతులు లైసెన్సులు ఉన్న ఫెర్టిలైజర్ షాపుల డీలర్ల వద్దనే కొనుగోలు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రశాంత్,అనిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
