మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 23
మణుగూరు టౌన్ పరిధి లోని ఆదర్శ్ నగర్ ఏరియా 138 బూత్ నందు జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు ఆదేశాల మేరకు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి నవీన్ దగ్గరుండి పర్యవేక్షించారు.పారిశుధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,మణుగూరు పట్టణ పారిశుధ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అత్యధిక నిధులు వెచ్చించి, పట్టణ పారిశుద్వానికై ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు.రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువలు, డ్రైనేజీలు,క్లీనింగ్ చేపిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,మణుగూరు టౌన్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 138వ బూత్ సమన్వయకర్త బొలిశెట్టి నవీన్,138 బూత్ ఇంచార్జ్ దర్శనాల శ్రీను,స్థానికులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.