మన్యం న్యూస్ గుండాల: ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన అనంతరం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ. అనంతరం కార్యదర్శుల సంఘం జిల్లా కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు. రెండు సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ కోసం ముఖ్యమంత్రి ప్రకటనతో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జీవితాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ పుష్పరాజ్, డి రమేష్, కె శ్రీనివాస్, టి అకుల్, వి సతీష్ , సిహెచ్ జ్యోతి, రామ్మోహన్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు
