UPDATES  

 జాతీయ గ్రామీణ ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు లేవు కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి.

  • జాతీయ గ్రామీణ ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు లేవు
  • కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలి.
  • సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి…
  • వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు

మన్యం న్యూస్ చర్ల:

చర్ల మండల కేంద్రంలోని సుబ్బయ్య కుంటలో జరుగుతున్న ఉపాధి పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా పని ప్రదేశంలో ఉన్న కూలీలతో సంభాషిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో ఉన్న కూలీలు మాట్లాడుతూ వేతనాలలో జాప్యం ఉందని, మౌలిక వసతులు నీడ, మెడికల్ కిట్లు, పనిముట్లకు సంబంధించిన రాయితీలు, మంచినీటి సౌకర్యం సక్రమంగా ఉండటం లేదని తెలిపారు. మాస్టర్ రోలు తీసుకుంటున్నారు కానీ రెండుసార్లు ఫోటోలు అప్లోడ్ చేయటం వంటి సమస్యలు ఉన్నాయని అన్నారు. వీటితోపాటు పని ప్రదేశంలో నీడ టెంట్లు, పని వస్తువులు లేని కారణంగా ఎండలో తట్టుకోలేక గృహ కోల్పోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సమ్మర్ బోనస్సు తమకు తెలియదని అన్నారు. పని ఇవ్వటంలో జాప్యం జరుగుతుందని, సక్రమంగా అడిగిన వారికి అందరికీ పనులు ఇవ్వటం లేదని తెలిపారు. వేతనాలు సరిగా పడటం లేదని, ధరలు పెరిగాయని కొలతల వలన తమ ఇబ్బంది జరుగుతుందని అన్నారు. పని జరిగిన రోజులలో పేస్లిప్లు ఇవ్వని కారణంగా ఏ పనికి ఎంత వేతనం చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదని వివరించారు. సమస్యలు వస్తే ఎవరూ పట్టించుకోవడంలేదని అన్నారు.
ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు ఉపాధి కూలీలతో మాట్లాడుతూ ఉపాధి పని ప్రదేశాలలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి వ్యవసాయ కార్మిక సంఘం పని ప్రదేశాల సందర్శన చేస్తుందని అందులో భాగంగా మీ వద్దకు రావడం జరిగిందని తెలుసుకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ సందర్భంగా పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా ఉందని అన్నారు. ఎండలు మెండుగా ఉన్న ఈ నేపథ్యంలో కూడా నీడ వసతులు లేకపోతే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు? ఈ మాత్రం ప్రభుత్వానికి అర్థం కాదా అని అన్నారు. పని ప్రదేశాలలో అనుముట్లకు సంబంధించి అధికారులు పట్టించుకోవటం లేదని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. కూలీ పడేవిధంగా ఈ ఎండాకాలం వరకైనా కొలతలతో సంబంధం లేకుండా కనీసం 300 రూపాయలు వేతనం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మర్ బోనస్సు ఏప్రిల్,మే, జూన్ మాసాలలో ఇస్తారని దీనిని కూడా కూలీలకు వివరించాలని కోరారు. పేస్లిప్లు ఇవ్వటం ద్వారా అన్ని వివరాలు కూలీలకు తెలుస్తాయని, అప్పుడు వారు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. తాము ఏం పని చేశాము? ఎంత వేతనం వస్తుందో అర్థం కాక సతమతమవుతున్నామని కూలీలు తెలిపారని, ఇటువంటి గందరగోళానికి తెర దింపాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కూలీలకు ఉపాధి కల్పన గా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వ్యవసాయానికి అనుసంధానం చేయాలని బిజెపి ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని మండలాలలో ఈ సమస్యలపై కూలీలను సమీకరించి మండల కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. తద్వారా అధికారులకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపారు.
రోజు కూలి పెరిగిన ధరలు అనుగుణంగా 600 రూపాయలు ఇవ్వాలని, రెండు వందల పది దినాలు ప్రతి కుటుంబానికి కల్పించాలని, పని ప్రదేశాలలో ప్రమాదాలు జరిగిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల సాధన కోసం ఈ నెల 25వ తేదీన హైదరాబాదులో ఉపాధి కూలీల రాష్ట్ర జరుగుతుందని ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. పని ప్రదేశం సందర్శనలో మచ్చ రామారావు, శ్యామల వెంకట్, నరసింహమూర్తి, ముఠామేస్త్రిలు, కూలీలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !