- వందపడకల ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం!
- ఒక రోజుకి 300 పైగానే ఓపిలు
- ఉప్పొంగుతున్న గిరిజనం!
- నేడు ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ రేగా కాంతరావు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 23
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కళ సాకారమైంది.గిరిజనానికి కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఆయన కోరిక నెరవేరింది.ఒక్క రోజుకి 300 కు మించి రోగులు వంద పడకల ఆసుపత్రికి వస్తున్నారు.పూర్తి స్థాయిలో సేవలను వినియోగించుకుంటున్నారు.పినపాక నియోజకవర్గ ప్రజానీకం రేగా కాంతారావు చేసిన మేలును గురించి చర్చించుకుంటున్నారు.ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం పొందాలంటే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది.రేగా కాంతారావు పుణ్యమా అని వంద పడకల ఆసుపత్రిలో మెరుగైన సేవలను వైద్యులు అందిస్తున్నారు.ప్రతిరోజు రోగులను పరిశీలించడం, అవసరమైన పరీక్షలను నిర్వహించడం,అవసరమైన వారికి వెంటనే శస్త్ర చికిత్సలు జరిపించడం వంద పడకల ఆసుపత్రిలో ఆనవాయితీగా నడుస్తుంది.ఒకవైపు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ, పినపాక నియోజకవర్గానికి మణిహారంగా ఉన్న వంద పడకల ఆసుపత్రిలో నేటి నుండి కిడ్నీ వ్యాధితో బాధపడే రోగులకు కోసం 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రంను నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. డయాలసిస్ కొరకు దూర ప్రాంతాలకు వెళ్లిన కిడ్నీ వ్యాధి రోగులకు నేడు రేగా కాంతారావు చేతుల మీదుగా డయాలసిస్ కేంద్రం ప్రారంభం కావడంతో డయాలిసిస్ రోగులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.కార్పొరేట్ హాస్పిటల్స్ స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పరికరాలతో ఈ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.ఆసుపత్రికి వచ్చే రోగులకు సత్వరమే సేవలందిస్తు,ఎప్పటికప్పుడు సిబ్బందిని సమన్వయ పరుస్తూ,రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించే విధంగా కృషి చేస్తున్న సూపరిండెంట్ రాంప్రసాద్,ఆర్ ఎం ఓ సునీల్,డాక్టర్లు సిబ్బంది ని ప్రజలు అభినందిస్తున్నారు. పినపాక నియోజకవర్గ ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు,వైద్య సహాయాన్ని అందించిన రేగా కాంతారావు ను పలువురు ప్రశంసిస్తున్నారు.