మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో అక్కడి ప్రజలు నీటిసమస్య ఉందని పలుమార్లు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకటోవార్డు సుందరయ్య చర్చి ఏరియా ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు స్వయంగా పురపాలక చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మంగళవారం అక్కడికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడి అధికారులను పిలిపించి సమస్యకు పరిష్కార మార్గం చూపారు. కొత్తగా ఏర్పడిన ఏరియా కాబట్టి ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సహకారంతో రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టి ఇంటి నెంబర్లు కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ ఏఈ శంకర్, మిషన్ భగీరథ డిపిఎం విజయ్, బారాస నాయకులు మాజీ కౌన్సిలర్ ఎలమందల వాసు, ఎర్ర ఈశ్వర్, భద్రం, సూర్యనారాయణ, మాడిశెట్టి రాజు, ఫిట్టర్ ఫయాజ్ బాబా, మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్ పెద్దినేని సాయి తదితరులు పాల్గొన్నారు.