11వ వేతన ఒప్పందంలో ఏఐటీయూసీ విశేషకృషి
ఏరియా వర్క్ షాప్ ఫిట్ మీటింగులో ఏఐటీయూసీ కేంద్రకమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య
మన్యం న్యూస్,ఇల్లందు: ఏఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో ఏరియా వర్క్ షాప్, సీహెచ్పీల నందు మంగళవారం ఉదయం షిఫ్ట్ కార్మికులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వర్కర్స్ యునీయన్ కేంద్రకమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… సింగరేణి బొగ్గుగని కార్మికుల పదకొండవ వేజ్ బోర్డు పదవ సమావేశం శుక్ర, శనివారాల్లో కలకత్తలో జరిగిందని, ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు అని తెలిపారు. వేజ్ బోర్డుపై శుక్రవారం జరిగిన చర్చల్లో యాజమాన్యం అంగీకరించిన విధంగా శనివారం సాయంత్రం ఐదు జాతీయకార్మిక సంఘాలతో కోల్ కతాలో జేబిసిసిఐ 11వ వేజ్ బోర్డు అగ్రిమెంట్ జరిగిందని, దానిపై యూనియన్ నాయకులు సంతకాలు చేసారని ఆయన తెలిపారు. కానీ హెచ్చ్ఎంఎస్, ఐఎన్టీయుసి యూనియన్లు శుక్రవారం ఇతర కార్మిక సంఘాలపై తప్పుడు ఆరోపణలు చేశారని, అవే సంఘాలు ఇతర సంఘాలతో కలిసి వేజ్ బోర్డు ఒప్పందం పై సంతకాలు చేసారని ఆయన పేర్కొన్నారు. ఏఐటీయూసీ మొదటి నుండి చెప్పిన విధంగా భారతదేశంలో ఇతర ప్రభుత్వరంగ పరిశ్రమలలో కంటే మెరుగుగా, గత పదవ వేజ్ బోర్డు కంటే అధికంగా కార్మికులకు లాభం జరిగే విదంగా పదకొండొవ వేజ్ బొర్డు అగ్రిమెంట్ చెయ్యడం జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే కొత్త జీతాలు జులై 1వ తారీఖున ఇచ్చే ఏర్పాటు చేయడానికి కోల్ ఇండియా చైర్మన్ అంగీకరించారని ఆయన తెలిపారు. కొత్త వేతనాలు అమలు కాగానే వేతన బకాయిలు కూడా సత్వరమే చెల్లించె విధంగా ఎఐటియుసి కృషి చేస్తుందని ఆయన అన్నారు. వేజ్ బొర్డు పరిష్కారం కొసం కేంద్రప్రభుత్వం అనేక ఆంక్షలు విధించిందని, పది సంవత్సరాల కాలపరిమితి ఉండాలని, డిపిఈ గైడ్లైన్స్ అనుసరించాలని, మరోవైపు కోలిండియా, సింగరేణి అధికారుల సంఘం అనేక అడ్డంకులు విధించినా వాటిని అధికమించి మెరుగైన వేతన ఓప్పందం అయిదు సంవత్సరాల కాలపరిమితితొ సమిష్టి కృషితో సాదించుకొగలిగామని వారు తెలిపారు. ఈసమావేశంలో ఫిట్ కార్యదర్శులు, నునె శ్రీనివాస్, భూషణం, చెరుకు సారయ్య, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.