మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ డ్రైవర్ సుమన్ వివాహం సందర్భంగా బయ్యారం మండలం సంతులాలు పోడుతండాలో మంగళవారం జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ, మండల నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బాదావత్ సీతారాములు నాయక్, బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు యలమద్ది రవి, ఇల్లందు పట్టణ కౌన్సిలర్ జెకె శీను, ఇల్లందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు, ఇల్లందు మండల కోఆప్షన్ సభ్యులు గాజి, ఎమ్మెల్యే పిఏ మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పిఏ మౌనిక, ఇల్లెందు మండల ఇంద్రనగర్ గ్రామపంచాయతీ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్, క్యాంప్ ఆఫీస్ సిబ్బంది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.