మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో బుధవారం నాడు శ్రీశ్రీశ్రీ శీతల పరమేశ్వరి నాబిశీల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో విప్ రేగా కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు పూజా కార్యక్రమం లో పాల్గొని,గ్రామ దేవతలను దర్శించుకున్నారు.అమ్మవార్ల ఆశీస్సులు గ్రామ ప్రజల కు ఉండాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో జడ్పిటిసి పోశం. నరసింహారావు,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, సీనియర్ నాయకులు వట్టం రాంబాబు,యాదగిరి గౌడ్ యూసఫ్,నాయకులు కృష్ణ, తాతా రమణ,గణేష్,యూత్ నాయకులు పవన్,రంజిత్, రమేష్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.