మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 24
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ జీవన విధానాన్ని పర్యావరణ హిత జీవనశైలిగా మార్చుకోవాలని మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ పర్యావరణ రహిత జీవనశైలి అవగాహన సదస్సులో పేర్కొన్నారు.దానిని అనుసరించి మిషన్ లైఫ్ లో భాగముగా కార్ పూలింగ్ ప్రోగ్రాంని సీ-టైప్ కాలనీ నుంచి జిఎం ఆఫీస్ వరకు సీ-టైప్ లో నివశిస్తున్న జిఎం ఆఫీస్ లో పని చేస్తున్న హెచ్ఓడి లు, ఇతర అధికారులను కార్ పూలింగ్ విధానములో రావాలని సూచించారు.జిఎం సూచనల మేరకు ఎస్ఓటు జిఎం ఆధ్వర్యంలో బుధవారం జిఎం ఆఫీస్ లో పని చేస్తున్న హెచ్ఓడి లు,ఉన్నతాధికారులు సీ-టైప్ కాలనీ నుండి జిఎం ఆఫీస్ వరకు కార్ పూలింగ్ విధానంలో విధులకు హాజరు కావడం జరిగింది.ఈ విధానం వల్ల ఇంధన పొదుపు, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించుకోవచ్చు అని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్ఓటు జిఎం డి.లలిత్ కుమార్,డిజిఎం పర్సనల్ సలగల.రమేష్,డిజిఎం పర్చేస్ శ్రీనివాస మూర్తి,ఏరియా పర్యావరణ అధికారి జే శ్రీనివాస్,డివై.ఎస్ఈ సివిల్ రాజేంద్ర ప్రసాద్,ఈఈ సివిల్ డివిఎస్ఎన్ ప్రవీణ్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు సింగు శ్రీ నివాస్,వి.రామేశ్వర రావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎండి షబీరుద్దీన్,సీనియర్ ఎస్టేట్స్ అధికారి బాబుల్ రాజు, ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.