UPDATES  

 లైబ్రరీ బిల్డింగ్ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:మే 24

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రాంగణం నందు సుమారు కోటి రూపాయల అంచనా వ్యయం తో నిర్మిస్తున్న లైబ్రరీ బిల్డింగ్ పనులను బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పరిశీలించారు.పనులు వివరాలను సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారికి విద్యా మెటీరియల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు,లైబ్రరీ కి సంబంధించిన లైటింగ్,కరెంటు తో పాటు ఇతర వసతి సౌకర్యాల మంజూరుకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను,కాంట్రాక్టర్ ను వారు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి పోశం.నర్సింహారావు,సొసైటీ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అప్పారావు, కార్యదర్శులు నవీన్,రామిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !