మన్యం న్యూస్,ఇల్లందు:తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ పార్టీ విషయాల గురించి ముద్రగడ వంశీ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ కు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ సభ్యత్వాల నమోదు ప్రక్రియ గురించి, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితులను కాసానికి జ్ఞానేశ్వర్ గారికి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇల్లందు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న వంశీని ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ అభినందించడం జరిగింది. ఈ సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడు రాజమండ్రిలో నిర్వహించడం జరుగుతుందని ఈ మహానాడు కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలకు వారు వివరించడం జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని అందులో ఎవరు సందేహించాల్సిన పనిలేదని, వీలైనంత ఎక్కువ సభ్యత్వాలు చేసి ప్రజలలో పార్టీని తీసుకువెళ్లాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిందిగా జ్ఞానేశ్వర్ దిశానిర్దేశం చేశారు.