దశాబ్ది ఉత్సవాలు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మురిసేలా
దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి
తెలంగాణ మలిదశ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమ నాయకులు సిలివేరి సత్యనారాయణ
మన్యం న్యూస్,ఇల్లందు:ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మురిసేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ మలిదశ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమనాయకులు సిలివేరు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సిలివేరి సత్యనారాయణ మాట్లాడుతూ… ఎందరో ప్రాణత్యాగాలతో 14ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్వరాష్ట్రం సాధించిన త్యాగశీలి సీఎం కెసిఆర్ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలు అనుసరించే విధంగా మారి దేశానికే తలమానికంగా నిలిచాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయిన రేగా కాంతారావు మరియు ఇల్లందు శాసనసభ్యురాలు హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశాల మేరకు జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు సిలివెరి సత్యనారాయణ పిలుపునిచ్చారు.