మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు యూనియన్ బ్యాంక్ నూతన మేనేజర్ గా లోహిత్ బాబు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇల్లందు బ్రాంచ్ నందు కొత్తగా విధులలోకి చేరిన బ్యాంక్ మేనేజర్ ను మన్యం మీడియా పలకరించగా ఆయన మాట్లాడుతూ… గత ఎనిమిది సంవత్సరాలుగా యూనియన్ బ్యాంక్ లో విధులు నిర్వహిస్తున్న తాను కుక్కునూరు నుండి ఇల్లందు బ్రాంచ్ కి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. యూనియన్ బ్యాంక్ లో బంగారు ఆభరణాలపై నిమిషాలలోనే రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని, ఒక్క గ్రాము బంగారానికి నాలుగు వేల రూపాయల ఋణం ఇవ్వనున్నట్లు మేనేజర్ లోహిత్ బాబు తెలిపారు. వినియోగదారులు యూనియన్ బ్యాంక్ సేవలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని, బ్రాంచ్ ద్వారా క్రాప్ రుణాలు, మహిళా సంఘాలకు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసే దిశగా రుణాలు ఇస్తామని, ఉద్యోగస్తులకు వాహన రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు యూనియన్ బ్యాంక్ సేవలు ఉపయోగించుకొని వారు అభివృద్ధి చెంది, బ్యాంక్ అభివృద్ధికి తోడ్పాటుగా వుండాలని మేనేజర్ లోహిత్ బాబు పిలుపునిచ్చారు. ఆర్బిఐ రెండువేల రూపాయల నోట్ల చలామణి రద్దు చేసిన నేపథ్యంలో ఆర్బిఐ నిబంధనలు అనుసరించి ఒక్కరు రోజుకి ఇరువై వేల రూపాయలవరకు మార్చుకోవచ్చు అని తెలిపారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరం అనుకుంటే బ్రాంచ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. వినియోగదారులకు యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయన్నారు.
