జిల్లా పరిషత్ ఛైర్మెన్ క్యాంప్ కార్యాలయంలో సోదరుల ఆనందం మన్యం న్యూస్,ఇల్లందు:అన్నదమ్ముల అనుబందానికి ప్రతీకగా నిలిచే సోదరుల దినోత్సవ సందర్భంగా బుధవారం ఇల్లందు పట్టణంలోని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కోరం కనకయ్య అనుచరులు ఒకరినొకరు కౌగలించుకొని అందరూ కలిసి కోరంకు సోదరుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పూనెం సురేందర్, నాయకులు ఊరుగొండ ధనుంజయ్, రావూరి సతీష్, కుంటా రాజు, అజ్జు, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
