మన్యం న్యూస్ చండ్రుగొండ మే 24 : రవికంపాడు పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయటం జరుగుతుందని సర్పంచ్ బానోతు రణ్య నాయక్ అన్నారు. బుధవారం పంచాయతీ పరిధిలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రవికంపాడు గ్రామపంచాయతీకి అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు సహకారంతో రూ. 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనాయన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజల్లోకి తీసుకెళ్లడమే పంచాయతీ పాలకవర్గ కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉపసర్పంచ్ పోతురాజు వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గాలం రవి, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి ముక్తేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భూపతి రమేష్, వార్డు సభ్యులు నిజాంపట్నం మల్లికార్జునరావు, భూక్య బద్రు,కాకటి సుదర్శన్, బాదావత్ వెంకటేష్, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, చిన్న పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.