మన్యం న్యూస్ దుమ్మగూడెం మే 24::
స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పేస్ 2 అవగాహన సమావేశం బుధవారం నాడు దుమ్ముగూడెం మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ రేసు లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం 100% మరుగుదొడ్లు నిర్మించుకోవడం, ఇంకుడు గుంతలు తీసుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించుకోవడం, తడి పొడి చెత్తను వేరు చేసి ఘన వ్యర్ధమును నిర్వహణ చేయడం, ప్లాస్టిక్ మలవెర్ధ నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని స్వతగా మీ అంతట మీరు స్వచ్ఛ క్లినిక్ కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు గ్రామాల్లో ఎవరైనా మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోతే త్వరగా పూర్తి చేయాలని దాని ద్వారా రోగాలను అరికట్టుకోవడం సులువుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీడీవో ముత్యాలరావు సమావేశపు మాస్టర్ ట్రైనర్స్ సందీప్ సునీల్ ఏపీఓ సుకన్య అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు